nikhil iddarth: ఏపీకి ప్రత్యేకహోదాపై గొంతు విప్పిన టాలీవుడ్ నటుడు నిఖిల్

  • ఏపీకి ప్రత్యేకహోదా కావాలి
  • ఏపీ వ్యాప్తంగా షూటింగ్ చేసుకొచ్చాము
  • ఏపీని ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కావాలంటూ టాలీవుడ్ యువనటుడు నిఖిల్ సిద్ధార్థ్ డిమాండ్ చేశాడు. ట్విట్టర్ ద్వారా స్పందించిన నిఖిల్, 'నేను కేవలం నటుడ్నే. కొంత మంది ఇవన్నీ నీకెందుకు అంటున్నారు. కానీ నేను ఈ మధ్య ఏపీ వ్యాప్తంగా షూటింగ్ ముగించుకుని వచ్చాను. ఏపీని ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయాలంటే ఏపీకి నిధులు కావాలి, అలా నిధులు కావాలన్నా, కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రత్యేక సాయం అందాలన్నా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఒక తెలుగువాడిగా, భారతీయుడిగా నేను రాష్ట్రాభివృద్ధిని కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేశాడు. కాగా, నిఖిల్ నటించిన 'కిరాక్ పార్టీ' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. 
nikhil iddarth
Andhra Pradesh
Tollywood
Special Category Status

More Telugu News