Manisharma: సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట్లో చోరీ

  • బీరువాలో భద్రపరిచిన రూ. 4 లక్షలు మాయం
  • పోలీసులకు ఫిర్యాదు
  • ఇంటి దొంగల పనేనని అనుమానాలు
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట్లో దొంగతనం జరిగింది. తన ఇంట్లోని బీరువాలో భద్రపరిచిన రూ. 4 లక్షలను దొంగిలించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులకు మణిశర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఫిలింనగర్‌ లోని తన ఇంట్లో కొద్ది రోజుల క్రితం రూ. 4 లక్షల నగదును బీరువాలో ఆయన భద్రపరిచారు. స్వీయ అవసరాల నిమిత్తం ఆదివారం నాడు డబ్బు కోసం బీరువా తీయగా అది కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్లు గుర్తించిన మణిశర్మ, తన మేనేజర్ సుబ్బానాయుడు ద్వారా పోలీసులకు ఫిర్యాదు పంపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఇది ఇంటి దొంగల పనే కావచ్చని అనుమానిస్తున్నారు.
Manisharma
Music Director
Theft
Hyderabad
Police

More Telugu News