USA: రెండున్నర దశాబ్దాల తర్వాత అమెరికా మళ్లీ అణుపరీక్ష.. ఏర్పాట్లలో పెంటగాన్ బిజీ!

  • అణు పరీక్షలకు సిద్ధపడుతున్న పెంటగాన్
  • శత్రు దేశాలకు తమ అణుపాటవం తెలియజేయాలన్న రాజకీయ లక్ష్యంతో అణుపరీక్షలు
  • లాస్ వెగాస్ కు 90 మైళ్ల దూరంలోని నెవాడా నేషనల్‌ సెక్యూరిటీ టెస్ట్‌ సైట్‌ సిద్ధం

అగ్రరాజ్యం అమెరికా మళ్లీ 'అణు'పాట పాడుతోంది. ఒకప్పుడు తన ఆయుధ సంపత్తిని ప్రదర్శించి శత్రు దేశాలను భయపెట్టాలని చూసిన అమెరికా.. సుమారు 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ అణుపరీక్షలకు సిద్ధమవుతోంది. ఉత్తరకొరియాతో ఉద్రిక్తతలు, చైనా కవ్వింపు చర్యలు నేపథ్యంలో ఈ అణుపరీక్షలకు అమెరికా తెరదీసింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పెంటగాన్ చడీచప్పుడూ లేకుండా పూర్తి చేస్తోంది.

ఆరునెలల్లో అణుపరీక్షలు నిర్వహించే విధంగా పెంటగాన్‌ పర్యవేక్షణలోని నెవాడా నేషనల్‌ సెక్యూరిటీ టెస్ట్‌ సైట్‌ ను సిద్ధం చేయాలన్న ట్రంప్ ఆదేశాలతో పనులు వేగం పుంజుకున్నాయి. ఇందుకోసం లాస్‌ వేగాస్‌ కు 90 మైళ్ల దూరంలోని పరీక్షాకేంద్రం సిద్ధమవుతోంది. దీనికి తోడు బడ్జెట్ కేటాయింపుల్లో అణుపరీక్షల కోసం 1,20,000 కోట్ల డాలర్లను ట్రంప్ ప్రభుత్వం కేటాయించింది.

 అయితే ఈ అణుపరీక్ష చాలా చిన్నదని ట్రంప్ సర్కార్ కొట్టిపడేస్తుండగా, ఇరాన్, చైనా, రష్యా, ఉత్తరకొరియాలకు తమ అణుపాటవం తెలియజేయాలన్న రాజకీయ లక్ష్యంతో చేస్తున్న పరీక్ష కావడంతో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పెంటగాన్ బయటపెట్టే అవకాశం లేదని టైమ్స్ పత్రిక కథనం ప్రచురించింది.

More Telugu News