YSRCP: ప్రత్యేక ప్యాకేజ్ ని అరుంధతీ నక్షత్రంతో పోల్చిన అంబటి రాంబాబు

  • ప్రత్యేక ప్యాకేజ్ ఎవరికీ కనపడదు!
  • టీడీపీ ఎంపీలు ఎవరిపై పోరాటం చేస్తారు?
  • నాలుగేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేశారు?: అంబటి రాంబాబు
ఇటీవల ప్రకటించిన కేంద్రబడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరగడంపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ ఎంపీలు ఎవరిపై పోరాటం చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. లీకుల మీద లీకులు ఇస్తూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని, ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజ్ కావాలని చంద్రబాబు అన్నారని, ఆ ప్యాకేజ్ కూడా దక్కేట్లు లేదని విమర్శించారు. ప్రత్యేక ప్యాకేజ్ అనేది అరుంధతీ నక్షత్రం లాంటిదని, అది ఎవరికీ కనపడదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
YSRCP
ambati rambabu

More Telugu News