child marriage: 13 మంది బాలికా వధువుల లేఖ... ప్రజాహిత వ్యాజ్యంగా స్వీకరించిన రాష్ట్ర హైకోర్టు

  • బాల్య వివాహాలను సమర్థంగా అరికట్టాలి
  • ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి తెలియజేయాలి
  • తమ ఇబ్బందులను చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారన్న కోర్టు

బాల్య వివాహాలతో బాధితులుగా మారిన 11 మంది బాలికలు హైదరాబాదు హైకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసి, అందులో తమలాంటి వారి పరిస్థితిని ఏకరువు పెట్టారు. దీన్ని ప్రజాహిత వ్యాజ్యంగా స్వీకరించి కోర్టు విచారణ చేపట్టింది. బాల్య వివాహాలను సమర్థవంతంగా నియంత్రించాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉందని, అలాగే, ఈ తరహా వివాహాల్లో పట్టుబడిన బాలికలకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి వివరించాలని సూచించింది.

ఈ లేఖ రాసిన బాలికలు 15-19 ఏళ్ల మధ్య వయసున్నవారే. వీరంతా తమ మానవ హక్కులను కోల్పోయి, వివాహం తర్వాత పడుతున్న కష్టాలను చెప్పుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు కోర్టు గుర్తించింది. చిన్న వయసులోనే గర్భం దాల్చడంతో ప్రసవం సమయంలో ప్రాణాలు కోల్పోతున్నారని, జీవించి ఉన్నా, వారికి పుట్టే పిల్లలకు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్న పరిస్థితులున్నాయని కోర్టు పేర్కొంది. ప్రభుత్వ పరంగా ప్రయోజనాలు అందక, కోర్టులను ఆశ్రయించే శక్తి లేకపోవడాన్ని గుర్తించింది. దీంతో వీరి లేఖను ప్రజాహిత వ్యాజ్యంగా భావించి విచారణ చేపట్టింది.

More Telugu News