pm: నేడు బెంగళూరుకు ప్రధాని మోదీ... 13,000 మంది పోలీసులతో పటిష్ఠ భద్రత

  • బీజేపీ ర్యాలీకి హాజరు
  • కర్ణాటక ఎన్నికల ముందు తొలి సభ
  • బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ రోజు బెంగళూరులో పర్యటించనున్నారు. బీజేపీ నిర్వహించే ర్యాలీలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో అక్కడి పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 13,000 మంది పోలీసులను ఇందుకు నియమించారు. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి అతి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాని తన పర్యటనతో అక్కడి బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపనున్నారు. ఇటీవలి కాలంలో అక్కడ బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ఈ పర్యటనలో ప్రధాని ఏం వ్యాఖ్యానిస్తారన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు కన్నడ సంస్థలు ఈ రోజు తలపెట్టిన బెంగళూరు బంద్ ను విరమించుకున్నాయి. గోవా రాష్ట్రంతో వున్న మహదాయి నదీ జలాల వివాదం విషయంలో ప్రధాని జోక్యం కోరుతూ ఈ బంద్ ను తలపెట్టాయి.
pm
Narendra Modi
bangalore

More Telugu News