India: డివిలియర్స్ వెనకాలే డుప్లెసిస్... మిగిలిన మ్యాచ్ లన్నింటికీ దూరమైన కెప్టెన్!

  • ఇప్పటికే జట్టుకు దూరమైన డివిలియర్స్
  • తాజాగా డుప్లెసిస్ కు గాయం
  • వన్డేలు, టీ-20 ఆటలకు దూరం
ఇండియాతో కీలకమైన రెండో వన్డేకు ముందు దక్షిణాఫ్రికాకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే గాయంతో తొలి మూడు వన్డే మ్యాచ్ లకు ఏబీ డివిలియర్స్‌ దూరం కాగా, నేడు జరిగే రెండో వన్డే ముందు మరో కీలక ఆటగాడు డుప్లెసిస్ జట్టుకు దూరమయ్యాడు. ప్రాక్టీసులో ఆయన చేతికి గాయం కావడంతో, మిగిలిన ఐదు వన్డేలు, టీ-20 పోటీల్లో ఆయన పాల్గొనబోడని దక్షిణాఫ్రికా వెల్లడించింది. తొలి వన్డేలో డుప్లెసిస్ అద్భుతంగా ఆడి సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ప్రధాన ఆటగాళ్లయిన డివిలియర్స్, డుప్లెసిస్ లు లేకపోవడం ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ పై పెద్ద ప్రభావాన్నే చూపుతుందని క్రీడా పండితులు వ్యాఖ్యానించారు.
India
South Afrika
Duplesis
Deviliers

More Telugu News