Chandrababu: చకచకా మారుతున్న ఏపీ రాజకీయం... శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేకు ఫోన్ చేసిన చంద్రబాబు

  • బీజేపీకి దూరమవుతున్న శివసేన
  • ఉద్ధవ్ తో చర్చించిన చంద్రబాబు
  • పార్టీలో మూడ్ బాగాలేదన్న ఏపీ సీఎం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చకచకా మారుతున్నాయి. ఇన్నాళ్లూ బీజేపీ మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం, బడ్జెట్ తరువాత మారిపోయింది. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని భావిస్తున్న చంద్రబాబు, అనూహ్యంగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేతో ఫోన్ లో మాట్లాడారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న శివసేన, ఇటీవల బీజేపీకి దూరమవుతుండగా, ఆ పార్టీ చీఫ్ తో మరో భాగస్వామ్య పార్టీ టీడీపీ అధినేత చర్చలు జరపడం పలు కొత్త చర్చలకు దారి తీసింది.

ఉద్ధవ్ తో చంద్రబాబు చర్చించిన విషయాన్ని శివసేన వర్గాలు ధ్రువీకరించాయి. ప్రస్తుతం తమ పార్టీలో ఉన్న మూడ్, 2019 ఎన్నికల వరకూ బీజేపీతో భాగస్వామ్యాన్ని వ్యతిరేకిస్తోందని చంద్రబాబు స్పష్టం చేసినట్టు సమాచారం. కాగా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం ఉద్ధవ్ తో తరచూ మాట్లాడుతూనే ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News