Anushka Shetty: ఇప్పటికిప్పుడు హీరోయిన్ అనుష్కతో మీ బైక్ లో పెట్రోలు కొట్టించుకోవాలా? ఎక్కడికి వెళ్లాలో చెప్పిన మంచు లక్ష్మి!

  • 'మేము సైతం' రెండో సీజన్ కు సిద్ధమైన మంచు లక్ష్మి
  • తొలి హోస్ట్ గా అనుష్క
  • ఫిల్మ్ నగర్ పెట్రోలు బంకులో పని చేయనున్న అందాల నటి
మీరు అందాల నటి అనుష్క వీరాభిమానులా? అమెను కలవాలని అనుకుంటున్నారా? అభిమానుల కోసం ఆమె ఓ పెట్రోలు బంకులో పని చేసేందుకు సిద్ధమైంది. అక్కడికి వెళ్లిన అభిమానులు తమ బైకులు, కార్లలో అనుష్క చేతుల మీదుగా పెట్రోలు కొట్టించుకోవచ్చు. అనుష్క చేత్తో పెట్రోలు పోయించుకోవాలంటే ఎక్కడికి వెళ్లాలో తెలుసా? హైదరాబాద్, ఫిల్మ్ నగర్, రోడ్ నంబర్ 1లో ఉన్న పెట్రోలు బంకుకు!

ఈ విషయాన్ని మంచు లక్ష్మి తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. తన టీవీ షో 'మేము సైతం' రెండో సీజన్ కు సిద్ధమైన లక్ష్మి, తొలి హోస్ట్ గా అనుష్కను ఆహ్వానించింది. సెలబ్రిటీలతో పని చేయించి, వారి అభిమానుల నుంచి డబ్బులు వసూలు చేసి ఓ కుటుంబాన్ని ఆదుకోవడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్న సంగతి తెలిసిందే. ఇక అనుష్క పెట్రోలు అమ్మి ఎంత వసూలు చేస్తుందో చూడాలి. అన్నట్టు ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం 10 గంటల నుంచేనట. అంటే ఇప్పుడే మొదలై పోయుంటుంది.
Anushka Shetty
Manchu Lakshmi
Petrol
Hyderabad
Film Nagar
Memu Saitam

More Telugu News