niharika: 'హ్యాపీ వెడ్డింగ్ ' షూటింగ్ పూర్తిచేసిన నిహారిక

  • నిహారిక తాజా చిత్రంగా 'హ్యాపీ వెడ్డింగ్'
  • హీరోగా సుమంత్ అశ్విన్ 
  • ఈనెల 14వ తేదీన ఫస్టులుక్

'ఒక మనసు' సినిమాతో తెలుగు తెరకి నిహారిక పరిచయమైంది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, నటనపరంగా నిహారికకు మంచి పేరు తెచ్చిపెట్టింది. కొంత గ్యాప్ తీసుకున్న నిహారిక .. తన రెండవ సినిమాగా 'హ్యాపీ వెడ్డింగ్' చేసింది. లక్ష్మణ్ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమా, తాజాగా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా, సహజత్వానికి దగ్గరగా వుండే కథతో ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఇది యూత్ కి సంబంధించిన కంటెంట్ కావడం వలన, ఈ సినిమా నుంచి ఈ నెల 14వ తేదీన ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమా, సుమంత్ అశ్విన్ కు .. నిహారికకు సక్సెస్ ను తెచ్చిపెడుతుందేమో చూడాలి.   

  • Loading...

More Telugu News