Jammu And Kashmir: జమ్మూకశ్మీర్లో రాళ్లదాడులు చేసిన 9,730 మందిపై కేసులు ఎత్తివేత

  • 1,745 కేసులు ఎత్తివేత  
  • సీఎం మెహబూబా ముఫ్తీ ప్రకటన


జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో వివిధ ఘటనల్లో రాళ్లు రువ్విన 9,730 మందిపై కేసులు ఎత్తివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ శనివారం ఆ రాష్ట్ర అసెంబ్లీకి వివరాలు వెల్లడించారు.

‘‘రాళ్లు రువ్విన ఘటనలకు సంబంధించిన 1,745 కేసులను ఎత్తివేయనున్నాం. ఈ అంశంపై ఏర్పాటు చేసిన కమిటీ ప్రతిపాదనల మేరకు 2008 నుంచి 2017 మధ్య నమోదైన కేసులను ఎత్తివేయడానికే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. ఇందులో చిన్న చిన్న ఘటనల్లో పాల్గొన్నవారు, తొలిసారిగా రాళ్ల దాడికి పాల్పడినవారిపై కేసులు ఉన్నాయి..’’ అని ముఫ్తీ తెలిపారు. ఇక 2016, 2017 సంవత్సరాల్లో జరిగిన దాడుల ఘటనలకు సంబంధించి 3,773 కేసులు నమోదు చేసి, 11,290 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. 

More Telugu News