road theft: 800 మీటర్ల రోడ్డును చోరీ చేసిన దొంగ.. !

  • రాత్రికి రాత్రే రోడ్డును మాయం చేశాడు
  • రోడ్డును తవ్వి, కాంక్రీట్ అమ్మేశాడు
  • డబ్బు కోసం రోడ్డు దొంగతనం

రాత్రికి రాత్రే 800 మీటర్ల పొడవైన రోడ్డును ఓ దొంగ చోరీ చేశాడు. తూర్పు చైనాలోని జియాంగ్సూ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీన్ని గుర్తించిన గ్రామస్తులు రోడ్డు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరిపిన పోలీసులు ఝూ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అన్ని విషయాలను ఝూ వెల్లడించాడు.

రోడ్డును తవ్వి, ఆ మెటీరియల్ ను ట్రాక్టర్ పై తరలించి, కాంక్రీట్ స్టోన్ మెటీరియల్ ఫ్యాక్టరీకి అమ్మేశానని అతను ఒప్పుకున్నాడు. డబ్బు సంపాదించేందుకు రోడ్డును, తవ్వి కాంక్రీట్ అమ్మాలనుకున్నానని... దీంతో, జనాలు ఎక్కువగా వినియోగించని ఈ రోడ్డు కనిపించిందని... రోడ్డును తవ్వి ఫ్యాక్టరీకి అమ్మేశానని చెప్పాడు. ఈ వార్త చైనా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. 'వావ్... ఇదొక ఇన్నొవేటివ్ ఐడియా' అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. 

More Telugu News