Cricket: మంజోత్ కల్రా సెంచరీ...అండర్-19 వరల్డ్ కప్ ను సొంతం చేసుకున్న భారత్!

  • మంజోత్ కల్రా సెంచరీ నాటౌట్
  • 220 పరుగులు సాధించిన భారత్
  • వరల్డ్ కప్ భారత్ సొంతం

న్యూజిలాండ్‌ వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్‌ ఫైనల్‌ లో రాహుల్ ద్రవిడ్ సానబెట్టిన సేన సత్తా చాటింది. జూనియర్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో వరల్డ్ కప్ ను ఒడిసిపట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టు 216 పరుగులు చేయగా, 217 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత జట్టు కేవలం రెండు వికెట్లు కోల్పోయి 38.5 ఓవర్లలో 220 పరుగులు సాధించి సగర్వంగా వరల్డ్ కప్ ను తలకెత్తుకుంది.

ఆసీస్ ఆటగాళ్లు మెరుపు ఫీల్డింగ్ తో భారత యువజట్టును అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ భారత బ్యాట్స్ మన్ దూకుడు ముందు నిలవలేకపోయారు. కెప్టెన్ పృథ్వీ షా (29), ఈ వరల్డ్ కప్ టాప్ స్కోరర్ శుభ్ మన్ గిల్ (31) భారీ స్కోర్లు సాధించనప్పటికీ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ మంజోత్ కల్రా (101) దూకుడుగా ఆడి సత్తాచాటగా, కీపర్ దేశాయ్ (47) స్థిరమైన ప్రదర్శనతో భారత జట్టు అండర్-19 వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. దీంతో భారత ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

More Telugu News