Narendra Modi: పేదలందరికీ రూ.5 లక్షల ఆరోగ్య బీమా... ముహూర్తం అక్టోబర్ 2!

  • అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల నగదు రహిత వైద్య బీమా
  • 2011 సామాజిక గణన ఆధారంగా అర్హుల గుర్తింపు
  • దేశవ్యాప్తంగా ఎక్కడైనా చికిత్స పొందే అవకాశం

పేదల కోసం కేంద్రం ప్రకటించిన రూ.5 లక్షల వైద్య బీమా (మోదీ హెల్త్ కేర్) అక్టోబర్ 2 నుంచి అమల్లోకి రానుంది. ఇందుకు అయ్యే వ్యయంలో 60 శాతం కేంద్రం, 40 శాతం వాటాను రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. ఒక ఏడాదిలో రూ.10,000-12,000 కోట్ల వరకు నిధులు ఈ పథకం నిర్వహణకు అవసరమవుతాయని నీతి ఆయోగ్ అంచనా.

ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల బీమా రక్షణ ఉంటుంది. ఇందుకు గాను ఒక్కో కుటుంబానికి రూ.1,000-1,200 వరకు ప్రీమియం ఉంటుందని అంచనా. దీన్ని ప్రభుత్వాలే భరిస్తాయి. 2011 సామాజిక, ఆర్థిక గణన డేటా ఆధారంగా పేదలైన 10 కోట్ల కుటుంబాలకు అర్హత కల్పిస్తారు. నగదు రహిత వైద్య సదుపాయం ఇది. ఆధార్ తో లింక్ అయి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో, దేశంలో ఎక్కడైనా వైద్య చికిత్సలు పొందొచ్చు.

  • Loading...

More Telugu News