mobile blast: బాంబు కంటే భయంకరంగా పేలిన చైనా మొబైల్!

  • ఇంట్లో మొబైల్ ఛార్జింగ్ పెట్టిన బాలుడు
  • ఛార్జింగ్ తీసివేస్తుండగా పేలుడు
  • చేతి వేలు, కన్ను ఛిద్రం

బాంబు కంటే భయంకరంగా మొబైల్ ఫోన్ పేలిన ఘటన చైనాలో చోటు చేసుకుంది. ఈ పేలుడులో ఓ బాలుడి చూపుడు వేలు చేతి నుంచి వేరు కాగా, కంటి చూపు కోల్పోయాడు. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే... దక్షిణ చైనాలోని గ్వాంగ్జి ప్రావిన్స్‌ కు చెందిన మెంజ్ జిషూ (12) అనే బాలుడు తన హువా టాంగ్ వీటీ-వీ59 మోడల్ మొబైల్‌ ను ఛార్జింగ్‌ కి పెట్టాడు.

కాసేపటి తరువాత ఛార్జర్ నుంచి ఫోన్ ను వేరు చేసి, మొబైల్ ను చేతిలోకి తీసుకున్న వెంటనే బాంబులా భారీ శబ్దంతో అది పేలిపోయింది. పేలుడు తీవ్రతకు మొబైల్ ప్లాస్టిక్ ముక్కలు బాలుడి తల, కంట్లోకి చొచ్చుకెళ్లడంతో క్షణాల్లో కుప్పకూలిన బాలుడికి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో బాలుడ్ని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఐదు గంటలపాటు శ్రమించి, బాలుడి, తల, కన్ను, ముఖం భాగాల్లో ఇరుక్కున్న ప్లాస్లిక్ ముక్కలను తొలగించి సర్జరీ చేసి బాలుడ్ని కాపాడినట్టు వైద్యులు తెలిపారు.  

More Telugu News