Telangana: మేడారంలో కేసీఆర్ కుటుంబం.. చిత్రమాలిక!

  • తన కుటుంబంతో కలిసి మేడారం సందర్శించిన సీఎం కేసీఆర్  
  • వనదేవతలకు పట్టు వస్త్రాల సమర్పణ
  • అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న కేసీఆర్
మేడారం జాతరను సీఎం కేసీఆర్ తన కుటుంబ సమేతంగా ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా వనదేవతలు సమ్మక్క-సారలమ్మలను కేసీఆర్, ఆయన సతీమణి శోభ, కూతురు కవిత, మనవడు హిమాన్షు, దర్శించుకున్నారు. వనదేవతలకు పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం, అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గద్దెల వద్దకు బంగారాన్ని మోసుకెళ్లి సమర్పించారు.

పగిడిద్దరాజు, గోవిందరాజులను దర్శించుకున్న కేసీఆర్ కుటుంబం మొక్కులు చెల్లించుకుంది. మేడారం జాతరను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు కూడా సందర్శించారు. మేడారం సందర్శించిన కేసీఆర్ కుటుంబం దృశ్యాలు.. 
Telangana
medaram
KCR

More Telugu News