varun tej: సెన్సార్ పూర్తి చేసుకున్న 'తొలిప్రేమ'

  • వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'తొలిప్రేమ' 
  • ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ 
  • ఈ నెల 10వ తేదీన విడుదల      

వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన 'తొలిప్రేమ' .. ఈ నెల 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి రెడీ అవుతోంది. కొంత సేపటి క్రితమే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, యు /ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. రాశి ఖన్నా కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి ఈ రోజు ఉదయం రిలీజైన ట్రైలర్ కి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

ఈ ట్రైలర్ లో వరుణ్ తేజ్ .. రాశి ఖన్నా ఇద్దరూ కూడా డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నారు. డైలాగ్స్ పరంగా .. సంగీతం పరంగా .. ఫోటోగ్రఫీ పరంగా ఈ ట్రైలర్ కి మంచి మార్కులు పడిపోయాయి. ఈ ట్రైలర్ ద్వారా ఈ సినిమాపై అంచనాలను పెంచడంలో, ఈ సినిమా టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఈ సినిమాతో వరుణ్ తేజ్ .. రాశి ఖన్నా కలిసి హిట్ కొడతారేమో చూడాలి. 

  • Loading...

More Telugu News