sharwanand: శర్వానంద్ జోడీగా 'హలో' హీరోయిన్

  • సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ 
  • ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు 
  • త్వరలో సెట్స్ పైకి  
'హలో' సినిమా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయినా, హీరోగా అఖిల్ కు .. హీరోయిన్ గా కల్యాణి ప్రియదర్శన్ కు మంచి మార్కులు పడ్డాయి. దాంతో కల్యాణి ప్రియదర్శన్ కి అవకాశాలు బాగానే వస్తున్నాయట. కుర్ర హీరోలు ఆమెను తమ సినిమాల్లో తీసుకోవడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఆమెకి శర్వానంద్ సరసన ఛాన్స్ దొరికినట్టు సమాచారం. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్ అయితే బాగుంటుందని భావించి, ఆమెను ఎంపిక చేశారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. కల్యాణి ప్రియదర్శన్ కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.    
sharwanand
kalyani

More Telugu News