toliprema: తొలిప్రేమ ట్రైలర్ విడుదల... బాగుందంటూ కితాబు!

  • 9 గంటలకు తొలిప్రేమ థియేట్రికల్ ట్రైలర్ విడుదల
  • అభిమానులను అలరిస్తున్న ట్రైలర్ 
  • వరుణ్ తేజ్, రాశీఖన్నా జంటకు అభిమానుల ఫిదా

మెగా హీరో వరుణ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన 'తొలి ప్రేమ‌' సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్ర బృందం ఇటీవల విడుదల చేసిన టీజర్ అంద‌రి మ‌న‌స్సుల‌కి హ‌త్తుకుని సినిమాపై ఆసక్తి రేపగా, ఈ ఉదయం 9 గంటలకు విడుద‌లచేసిన ట్రైల‌ర్ ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. ట్రైల‌ర్‌ లోని ప్ర‌తి ఫ్రేమ్ ను దర్శకుడు, సినిమాటోగ్రఫర్ చాలా అందంగా తీర్చిదిద్దారు.

‘జ్ఞాపకాలు చెడ్డవైనా, మంచివైనా మనతోనే ఉంటాయి.. మోయక తప్పదు..’ అనే వరుణ్ తేజ్ డైలాగ్‌ తో ప్రారంభమైన ఈ థియేట్రికల్ ట్రైలర్ ఇదే డైలాగ్ ను రాశీఖన్నా బాధగా చెప్పడంతో ముగుస్తుంది. రాశిఖన్నా, వరుణ్ తేజ్ జంట చాలా బాగా కనిపించింది. ప్రధానంగా రాశీ ఖన్నా గత సినిమాల కంటే చాలా అందంగా కనిపించింది. కాగా, ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.      

More Telugu News