american indians: అమెరికాలో ఇద్దరు ప్రవాస భారతీయులు దారుణ హత్య!

  • భారత సంతతి తల్లి, కుమారుడు హత్య
  • కాల్చి చంపిన దుండగులు
  • ఓ యువకుడిని విచారిస్తున్న పోలీసులు
అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి. భారతీయ సంతతి మహిళ, ఆమె కుమారుడు అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపి, వీరిద్దరినీ హత్య చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, వీరిద్దరూ మాలా మన్వానీ (65), రిషి మన్వానీ (32). వాషింగ్టన్ లోని వర్జీనియా సబర్బ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

హత్య జరిగిన ఇంట్లో తల్లి, కుమారుడు మాత్రమే ఉన్నారు. జాతి విద్వేష హత్య అని తాము భావించడం లేదని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి ఓ యువకుడిని విచారిస్తున్నారు. దోషులను కచ్చితంగా పట్టుకుని తీరుతామని పోలీసులు చెప్పారు. ప్రజలు భయపడాల్సిందేమీ లేదని అన్నారు. 
american indians
murder
fire
america

More Telugu News