Filpkart: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.55 వేల ఐఫోన్ బుక్ చేస్తే.. పది రూపాయల సబ్బు బిళ్ల వచ్చింది.. లబోదిబోమంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

  • పార్శిల్ విప్పి విస్తుపోయిన యువకుడు
  • పోలీసులకు ఫిర్యాదు
  • దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పిన ఫ్లిప్‌కార్ట్

ఐఫోన్ బుక్ చేస్తే డిటర్జెంట్ సోప్ పంపిన ఫ్లిప్‌కార్టుపై కేసు నమోదైంది. ముంబైకి చెందిన 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తబ్రేజ్ మెహబూబ్ నగ్రాలి ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్-8 బుక్ చేశాడు. ఫోన్ ఖరీదు రూ.55 వేలను ముందుగానే చెల్లించాడు.

జనవరి 22న ఫ్లిప్‌కార్ట్ నుంచి పార్సిల్ రాగా, ఆనందంతో విప్పి చూసిన అతడికి లోపల సబ్బు బిళ్ల కనిపించింది. విస్తుపోయిన తబ్రేజ్ లబోదిబోమంటూ సెంట్రల్ ముంబైలోని బైకుల్లా పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన మోసంపై ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు ఫ్లిప్‌కార్ట్‌పై చీటింగ్ కేసు నమోదు చేసినట్టు బైకుల్లా  పోలీస్ స్టేషన్ సీనియర్ సీఐ అవినాష్ షింగ్టే తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఫ్లిప్‌కార్ట్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News