Shruti: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • జోక్యం చేసుకోనంటున్న శ్రుతి!
  • మోహన్ బాబు 'గాయత్రి'కి సెన్సార్ క్లియరెన్స్ 
  • హార్వార్డ్ యూనివర్శిటీ సదస్సుకి కమల్ 
  • అనుష్కకు మెగా హీరో కాంప్లిమెంట్స్    
*  ఏ సినిమా విషయంలోనైనా దర్శకుడి పనిలో తాను జోక్యం చేసుకోనని అంటోంది అందాలభామ శ్రుతి హాసన్. 'నా పాత్ర ఇలా వుండాలి, అలా వుండాలి అని ఏ దర్శకుడికీ చెప్పను. దర్శకుడు ఎలా చెబితే అలాగే చేస్తాను. అతని పనిలో జోక్యం చేసుకోను. అందుకే, తెరపై నా క్యారెక్టర్ బాగుందంటే ఆ ఘనత దర్శకుడికే ఇస్తాను. బాగోలేనప్పుడు కూడా ఆ క్రెడిట్ ఎక్కువగా అతనికే చెందుతుంది' అని చెప్పింది.
*  మోహన్ బాబు ప్రధాన పాత్ర పోషించిన 'గాయత్రి' చిత్రం సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ పొందింది. ఈ నెల 9న చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మదన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలను విష్ణు, శ్రియా పోషించారు.
*  ప్రముఖ నటుడు కమలహాసన్ ని అమెరికాలోని ప్రఖ్యాత హార్వార్డ్ యూనివర్శిటీ ఓ సదస్సుకి ఆహ్వానించింది. ఈ నెల 10న జరిగే ఈ సదస్సులో ఆయన ప్రస్తుతం తమిళనాడు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యపై మాట్లాడతారు.
*  కథానాయిక అనుష్కపై మెగా హీరో రామ్ చరణ్ ప్రశంసలు కురిపించాడు. 'భాగమతి' సినిమా చూశానని, అనుష్క అభినయం మైండ్ బ్లోయింగ్ గా వుందని, ఆమెకు, చిత్రం టీమ్ కు కంగ్రాట్స్ అని పేర్కొన్నాడు.       
Shruti
mohan Babu
Kamal Haasan
charan

More Telugu News