Supreme Court: సుప్రీంకోర్టులో కొత్త రోస్టర్‌ ను ప్రకటించిన సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా

  • ‘సుప్రీం’లో ఈ నెల 5 నుంచి కొత్త కేసుల విచారణ
  •  రోస్టర్ ను బయటకు ప్రకటించడం ఇదే తొలిసారి
  • సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో రోస్టర్ కు సంబంధించిన పూర్తి వివరాలు
సుప్రీంకోర్టులో ఈ నెల 5వ తేదీ నుంచి విచారణకు స్వీకరించే కేసులకు సంబంధించిన రోస్టర్ ను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా ప్రకటించారు. ఈ విధంగా బయటకు ప్రకటించడం ఇదే తొలిసారి. కొత్త రోస్టర్ ప్రకారం, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్), ఎన్నికల వివాదాలు, నేర సంబంధిత, సామాజిక న్యాయానికి సంబంధించిన కేసులను విచారించనున్నారు.

అవసరమైన సమయంలో రాజ్యాంగ బెంచ్, ప్రత్యేక విచారణల నిమిత్తం విచారణ కమిషన్ నూ ఏర్పాటు చేస్తారు. కేవలం, కొత్త కేసులకు మాత్రమే ఈ రోస్టర్ కు సంబంధించిన పూర్తి వివరాలను సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో పొందుపరిచారు. కాగా, సుప్రీం కోర్టులో సీనియర్ జడ్జి జస్టిస్ చలమేశ్వర్ కార్మిక, పరోక్షపన్నులు, నేర సంబంధిత అంశాలు, వినియోగదారుల రక్షణ కేసులను విచారిస్తారు. 
Supreme Court
Deepak misra
cji

More Telugu News