samrat: అందుకే, కోపంతో సీసీ టీవీ కెమెరాను ధ్వంసం చేశా: సినీనటుడు సామ్రాట్ రెడ్డి

  • నా ఇంట్లో నా వస్తువులు తీసుకోవడానికి వస్తే నాపై గొడవ పడ్డారు
  • హర్షిత చేసిన ఆరోపణల్లో నిజం లేదు
  • నన్ను వరకట్నం కేసులో బుక్ చేయాలని చూస్తున్నారు
  • నేను ఎప్పుడూ కట్నం అడగలేదు

టాలీవుడ్‌ యువనటుడు సామ్రాట్‌ రెడ్డిపై ఆయన భార్య హర్షిత కేసు పెట్టిన విషయం తెలిసిందే. సామ్రాట్‌ గత కొంతకాలంగా తనను వేధిస్తున్నాడని, తాజాగా ఇంట్లో దొంగతనానికి యత్నించాడని ఆమె ఆరోపించింది. కాగా, ఈ కేసులో అరెస్టయిన సామ్రాట్ రెడ్డికి బెయిల్ లభించడంతో ఆయనను చర్లపల్లి జైలు నుంచి విడుదల చేశారు.

తాజాగా మీడియాతో సామ్రాట్ రెడ్డి మాట్లాడుతూ... 'టెక్నాలజీ చాలా అభివృద్ధి జరిగింది. నిన్న రాత్రి నేను జైలులో ఉండగా మా అక్కకు నా పేరిట ఓ మెసేజ్ పంపారు.. కానీ, ఆ మెసేజ్ పంపింది నేను కాదని మా అక్కకు అర్థం అయిపోయింది. నేను డ్రగ్స్ తీసుకుంటానని కూడా హర్షిత అంటోంది. హర్షితకి హుక్కా అంటే పడదు. నేను హుక్కా కొడతాను. ఆమె హుక్కానే డ్రగ్స్ అనుకుంటోందేమో' అని సామ్రాట్ అన్నాడు.

తన ఇంట్లో తన వస్తువులు తీసుకోవడానికి వెళ్లానని, ఆ మాత్రానికే తనపై గొడవ పడ్డారని, దీంతో కోపంతో తాను సీసీ టీవీ కెమెరాను ధ్వంసం చేశానని సామ్రాట్ రెడ్డి అన్నాడు. అనంతరం తన వస్తువులు ఇంట్లోంచి తీసుకుని పోయానని అన్నారు. హర్షిత చేసిన ఆరోపణల్లో నిజం లేదని అన్నాడు. తనను వరకట్నం కేసులో బుక్ చేయాలని చూస్తున్నారని, తాను ఎప్పుడూ కట్నం అడగలేదని, తన వద్ద కావలసినంత డబ్బు ఉందని చెప్పాడు. అయినప్పటికీ హర్షిత మనసు మార్చుకుంటే మళ్లీ కలిసి ఉండేందుకు సిద్ధమని చెప్పుకొచ్చాడు.

More Telugu News