avanthi srinivas: సహనానికి ఓ హద్దు ఉంటుంది.. మాకు పదవులు ముఖ్యం కాదు: టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌

  • నాలుగేళ్లయినా నిధులు ఇవ్వడం లేదు 
  • రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీలేదు
  • ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలి
  • నాలుగేళ్లుగా సహనంతో ఉన్నాం
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై టీడీపీ ఎంపీలు భగ్గుమంటున్నారు. ఢిల్లీలో టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని, నాలుగేళ్లయినా నిధులు ఇవ్వలేదని విమర్శించారు. తమకు పదవులు ముఖ్యం కాదని, ఓర్పు, సహనానికి ఓ హద్దు ఉంటుందని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీలేదని చెప్పారు. ఏపీ ప్రజల మనోభావాలను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి నాలుగేళ్లుగా సహనంతో ఉన్నామన్నారు.  
avanthi srinivas
Telugudesam
budget

More Telugu News