charan: చరణ్ .. బోయపాటి మూవీలో టాప్ హీరోయిన్ తో స్పెషల్ సాంగ్

  • రెండవ షెడ్యూల్ కి రెడీగా బోయపాటి మూవీ
  • స్పెషల్ సాంగ్ కోసం దేవిశ్రీ కసరత్తు
  • క్రేజ్ వున్న కథానాయికను తీసుకోవాలనే ఆలోచన  

చరణ్ హీరోగా బోయపాటి శ్రీను ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగును పూర్తి చేసుకుంది. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా రెండవ షెడ్యూల్, ఈ నెల రెండవ వారం నుంచి జరుపుకోనుంది. రెండవ షెడ్యూల్ నుంచి షూటింగులో చరణ్ పాల్గొననున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

 ప్రస్తుతం ఆయన ఒక స్పెషల్ సాంగ్ కోసం ట్యూన్ చేస్తున్నాడట. ఈ స్పెషల్ సాంగ్ ను ఒక టాప్ హీరోయిన్ పై చిత్రీకరించే ఆలోచనలో వున్నారని అంటున్నారు. ఇందుకోసం టాప్ హీరోయిన్స్ పేర్లతో ఒక లిస్ట్ ను తయారు చేశారట. త్వరలో వాళ్లలో ఒకరిని ఎంపిక చేయనున్నట్టు చెబుతున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో, వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తూ ఉండగా .. మరో ముఖ్యమైన పాత్రలో స్నేహ నటిస్తోంది.   

More Telugu News