varun tej: భీమవరంలో 'తొలిప్రేమ' ప్రీ రిలీజ్ వేడుక

  • విడుదలకి ముస్తాబవుతోన్న 'తొలిప్రేమ'
  • ఈ నెల 3వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • వేదికగా 'భీమవరం'    

వరుణ్ తేజ్ .. రాశి ఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'తొలిప్రేమ' సినిమా తెరకెక్కింది. యూత్ కి కనెక్ట్ అయ్యే టైటిల్ తో .. కంటెంట్ తో ఈ సినిమాను రూపొందించారు. ఈ నెల 10వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 3వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా 'భీమవరం'లో జరపాలని నిర్ణయించుకున్నారు.

ఈ సినిమా యూనిట్ సభ్యులంతా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ సినిమా రిలీజ్ కి ముందు గుంటూరు .. విశాఖల్లోని కాలేజ్ లలో స్టూడెంట్ మీట్ లు నిర్వహిస్తారట. ఇలా యూత్ దృష్టిని ఈ సినిమా వైపు మళ్లించే ప్రయత్నం చేయడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ నెల 4న 'ఇంటిలి జెంట్' ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. 

More Telugu News