budget: వేతన జీవికి నిరాశ... మారని పన్ను విధానం... అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం ముఖ్యాంశాలు - 3

  • 2018-19 బడ్జెట్ అంచనా రూ. 21.57 లక్షల కోట్లు
  • స్థూల జాతీయ ఉత్పత్తిలో ద్రవ్య లోటు అంచనా 3.3 శాతం
  • 11 శాతం పెరిగిన వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు
  • గత రెండేళ్లలో భారీగా పెరిగిన పన్ను వసూళ్లు

పార్లమెంట్ లో అరుణ్ జైట్లీ ప్రతిపాదిస్తున్న 2018-19 బడ్జెట్ లోని మరికొన్ని ముఖ్యాంశాలు...

* 2017-18 సవరించిన బడ్జెట్ రూ. 21.54 లక్షల కోట్లు.
* 2018-19 స్థూల జాతీయ ఉత్పత్తిలో ద్రవ్య లోటు అంచనా 3.3 శాతం.
* 2018-19 బడ్జెట్ అంచనా రూ. 21.57 లక్షల కోట్లు.
* 12.6 శాతం పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు.
* పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాల పెంపు.
* ఐదేళ్లకోసారి ఎంపీల వేతనాల్లో మార్పు.
* రీజనల్ కనెక్టివిటీ కోసం కొత్తగా 56 విమానాశ్రయాలు, 11 హెలిప్యాడ్ లు.

* ఈ సంవత్సరం జీఎస్టీ వసూళ్లు 11 నెలలే అందుతున్నాయి.
* 11 శాతం పెరిగిన వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు.
* 8.72 కోట్లకు చేరుకున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య.
* బ్లాక్ మనీపై చేస్తున్న పోరాటం సత్ఫలితాలను ఇస్తోంది.
* 2016-17లో పన్ను చెల్లింపుదారులు 19.25 లక్షల మంది పెరిగారు.
* గత రెండేళ్లలో భారీగా పెరిగిన పన్ను వసూళ్లు.
* 40 శాతం పెరిగిన రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య.
* మారని వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితులు.
* కొనసాగనున్న ప్రస్తుత శ్లాబ్ విధానం.

* వేతనజీవులకు ప్రయాణ, వైద్య ఖర్చులపై రూ. 40 వేల వరకూ పన్ను రాయితీ.
* సీనియర్ సిటిజన్ల వైద్య ఖర్చులకు మరింత అదనపు రాయితీ.
* వయో వృద్ధులకు అదనపు రాయితీ రూ. 60 వేల నుంచి రూ. లక్షకు పెంపు.
* వయోవృద్ధుల డిపాజిట్లపై రూ. 50 వేల వరకూ టీడీఎస్ రద్దు.
* తీవ్ర అనారోగ్యాల బారిన పడ్డ సీనియర్ సిటిజన్లకు ఇల్ నెస్ డిడక్షన్ రూ. 50 వేలు.

* రూ. 250 కోట్ల టర్నోవర్ ఉన్న కార్పొరేట్ కంపెనీలపై 25 శాతం పన్ను.
* స్టాండర్డ్ డిడక్షన్ ద్వారా ప్రభుత్వ ఆదాయంలో రూ. 8 వేల కోట్ల లోటు.
* మొబైల్ ఫోన్ల దిగుమతులపై కస్టమ్స్ సుంకాలు 15 నుంచి 20 శాతం పెంపు.
* దిగుమతి చేసుకునే వస్తువులపై సామాజిక అభివృద్ధి సెస్ పెంపు.
*సామాజిక అభివృద్ధి సెస్ 10 శాతానికి పెంపు.
* విద్యాభివృద్ధి సెస్ 4 శాతానికి పెంపు.

  • Loading...

More Telugu News