stock markets: బడ్జెట్ కు ముందు స్టాక్ మార్కెట్ల పరుగులు

  • 166 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 
  • 40 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్న నిఫ్టీ
  • బడ్జెట్ కు ముందు ఆశాభావం

కేంద్ర బడ్జెట్ ప్రకటనకు ముందు దేశీయ స్టాక్ మార్కెట్లు ర్యాలీ చేస్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఈ ఉదయం 250 పాయింట్లకు పైగా పెరగ్గా, ప్రస్తుతం 166 పాయింట్ల లాభంతో 36,134 స్థాయిలో ట్రేడ్ అవుతోంది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 73 పాయింట్లకు పైగా లాభంతో 11,100 స్థాయి వరకు పెరిగి ప్రస్తుతం 40 పాయింట్ల లాభంతో 11,068 స్థాయిలో ఉంది. ఎల్ అండ్ టీ, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, టీసీఎస్, ఎంఅండ్ఎం, ఇండస్ఇండ్ బ్యాంకు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా, కోల్ ఇండియా, వేదాంత లిమిటెడ్, భారతీ ఇన్ ఫ్రాటెల్, బీపీసీఎల్, టాటా స్టీల్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

More Telugu News