Reliance: ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు మరోమారు సిద్ధమైన జియో.. త్వరలో డెడ్లీ చీప్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్!

  • అతి త్వరలో జియో నుంచి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్
  • గూగుల్, మీడియా టెక్‌తో ఒప్పందం
  • ‘లైఫ్’ బ్రాండ్ కింద విడుదల

అరంగేట్రంతోనే ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టించిన రిలయన్స్ జియో ఇప్పుడు మరోమారు చావుదెబ్బ కొట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే చవక 4జీ ఫీచర్ ఫోన్‌తో దిగ్గజ టెలికం కంపెనీలకు షాకిచ్చిన జియో ఇప్పుడు అత్యంత చవకైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు రెడీ అయింది. ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్ ఆండ్రాయిడ్ 'ఓరియో గో'తో పనిచేసే 4జీ స్మార్ట్‌ఫోన్లను ‘లైఫ్’ బ్రాండ్ కింద విడుదల చేయనుంది. ఇందుకోసం తైవాన్‌కు చెందిన చిప్‌మేకర్ మీడియా టెక్‌, గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే వీటిని మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు మీడియా టెక్ తెలిపింది.

జియో ఇటీవల విడుదల చేసిన 4జీ ఫీచర్ ఫోన్లకు వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. దీంతో తమ ఖాతాదారులను కాపాడుకునేందుకు ఇతర టెల్కోలు కూడా చవక 4జీ ఫీచర్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చాయి. దీంతో ఇప్పుడు మరోమారు ప్రత్యర్థులను దెబ్బ కొట్టేందుకు డెడ్లీ చీప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావాలని నిర్ణయించిన జియో ఈ మేరకు మీడియా టెక్, గూగుల్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఓఎస్ ఓరియో (గో ఎడిషన్)తో పనిచేసే ఫోన్ల విడుదలకు సిద్ధమైంది. జియో కోసం ఆండ్రాయిడ్ గో ప్లాట్‌ఫాంపై పనిచేసే ఎంటీ6739, ఎంటీ6580 పేరుతో చిప్‌సెట్లను అభివృద్ధి చేస్తున్నట్టు మీడియా టెక్ తెలిపింది.

More Telugu News