ntr: ఎన్టీఆర్, సినారె లపై విమర్శలు గుప్పించిన బాబు గోగినేని!

  • హేతువాదినని చెప్పుకున్న సి.నారాయణరెడ్డిని తప్పుబట్టాలి
  • తెలుగు వర్శిటీలో జ్యోతిష్యంను కోర్సుగా ప్రవేశపెట్టింది ఆయనే
  • ఎన్టీఆర్ కి జ్యోతిష్యంపై నమ్మకం ఉంది
  • అందుకే, ఆ సిలబస్ ను సినారె ప్రవేశపెట్టారు: బాబు గోగినేని

దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు, నటుడు ఎన్టీఆర్ పైన.. దివంగత కవి, రచయిత, అభ్యుదయవాది సి.నారాయణరెడ్డి (సినారె) పైన ప్రముఖ హేతువాది బాబు గోగినేని విమర్శలు గుప్పించారు. ‘టీవీ9’లో చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ‘హేతువాదినని చెప్పుకున్న సి.నారాయణరెడ్డిగారిని తప్పుబట్టాలి. ఎందుకంటే, హైదరాబాద్ లోని తెలుగు యూనివర్శిటీకి ఆయన మొదటి వైస్ ఛాన్సలర్ అయినప్పుడు జ్యోతిష్యంను కోర్సుగా ప్రవేశపెట్టారు.

రాజకీయ నాయకుడైన ఎన్టీ రామారావు గారికి జ్యోతిష్యంపై నమ్మకం ఉంది కనుక ఆ సిలబస్ ను సి.నారాయణరెడ్డి గారు ప్రవేశపెట్టారు. అందువల్లే, ఇప్పుడు .... ఇంతమంది (జ్యోతిష్యులు) తయారయ్యారు. వాళ్లకు (జ్యోతిష్యులు) వున్నది ప్రొఫెషనల్ డిగ్రీ కాదు, ఆర్ట్స్ డిగ్రీ. వీళ్లు (జ్యోతిష్యులు) ఎంత బిల్డప్ ఇస్తున్నారు?’ అంటూ మండిపడ్డారు.

More Telugu News