cockroach: బొద్దింకను చూసి భయపడి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న మహిళ

  • డ్రైవ్ చేస్తూ వెళుతోన్న మహిళ
  • కారులో బొద్దింకను చూసి భయంతో వాహనంపై నియంత్రణ కోల్పోయిన వైనం
  • ఓవర్ హెడ్ బ్రిడ్జి వైపు దూసుకెళ్లిన కారు
  • సింగపూర్‌లోని జోరోంగ్ ఈస్ట్ సెంట్రల్ ప్రాంతంలో ఘటన

బొద్దింక, బల్లి వంటి ప్రాణులంటే చాలా మందికి ఎంతో భయం ఉంటుంది. వాటిని చూస్తే చాలు భయంతో వణికిపోతారు. కాగా, బొద్దింకను చూసి భయపడిపోయిన ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన సింగపూర్‌లోని జోరోంగ్ ఈస్ట్ సెంట్రల్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

కారు డ్రైవ్ చేస్తూ వెళుతున్న ఆ మహిళకు కారులో బొద్దింక కనపడింది. దీంతో ఆమె భయంతో వణికిపోయి వాహనంపై నియంత్రణ కోల్పోయింది. దీంతో ఆ కారు అదుపుతప్పి ఓవర్ హెడ్ బ్రిడ్జి వైపు దూసుకెళ్లింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 

  • Loading...

More Telugu News