Tollywood: యాక్సిడెంట్ లో హీరో నానికి పన్ను ఊడిందట!

  • ఆర్టిఫీషియల్ పన్ను పెట్టించుకునే పనిలో నాని
  • అందుకే, వారం రోజుల విశ్రాంతి తీసుకుంటున్నాడట
  • ఓ ఆంగ్ల పత్రిక కథనం

టాలీవుడ్ యంగ్ హీరో నాని కారు ఇటీవల యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఈ ప్రమాదం జరిగింది. షూటింగ్ ముగించుకుని అర్ధరాత్రి తిరిగి వస్తుండగా డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో నానితో పాటు అతని తండ్రి కూడా ఉన్నారు.

స్వల్పగాయాల కారణంగా వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని నానికి వైద్యులు సూచించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాదంలో నాని దంతాలకు బలంగా దెబ్బ తగిలిందని ఓ ఆంగ్ల పత్రిక కథనం. ఒక పన్ను పూర్తిగా ఊడిపోయిందని, ఆర్టిఫీషియల్ పన్నును పెట్టించుకునే పనిలో ఉన్నారని, అందుకే, వారం రోజుల విశ్రాంతి తీసుకుంటున్నారనేది ఆ పత్రిక కథనం. ఈ వార్తపై నాని స్పందించాల్సి ఉంది. కాగా, నాని తాజాగా నటిస్తున్న చిత్రం 'కృష్ణార్జున యుద్ధం'.  

  • Loading...

More Telugu News