sarathkumar: సోషియో ఫాంటసీగా 'పాంబన్' .. పాము రూపంలో శరత్ కుమార్

  • శరత్ కుమార్ ప్రధాన పాత్రలో 'పాంబన్'
  • పాము రూపంలో శరత్ కుమార్ 
  • ఆకట్టుకుంటోన్న పోస్టర్స్

కెరియర్ ఆరంభంలో మాస్ యాక్షన్ హీరోగా మార్కులు కొట్టేసిన శరత్ కుమార్, ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే సినిమాలను చేస్తూ వచ్చారు. తాజాగా ఆయన ఒక సోషియో ఫాంటసీ సినిమాను చేయడానికి రెడీ అవుతున్నారు. ఎస్.ఎస్.కె. నిర్మాణంలో కోలీవుడ్ డైరెక్టర్ వెంకటేశ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ భారీ సోషియో ఫాంటసీ సినిమాకి 'పాంబన్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ రోజే చెన్నైలో షూటింగ్ మొదలెట్టిన ఈ సినిమా టీమ్, ఫస్టులుక్ పోస్టర్స్ ను వదిలారు. నీలి కళ్లతో .. పొలుసులతో కూడిన పాము రూపంలో ఈ పోస్టర్స్ లో శరత్ కుమార్ కనిపిస్తున్నాడు. నాగవంశానికి చెందిన ఓ రాజు కథగా ఈ సినిమా రూపొందుతోంది. స్నేక్ మేన్ గా ఈ సినిమాలో శరత్ కుమార్ కనిపిస్తుండటం విశేషం. శరత్ కుమార్ కెరియర్లో ఇంతవరకూ ఆయన చేసిన పాత్రలకు ఇది పూర్తి భిన్నమైనదని అంటున్నారు.        

More Telugu News