rahasthan: తన పిల్లలను ఫ్యానుకి వేలాడదీసి.. దారుణంగా హింసించిన తండ్రి.. వీడియో వైరల్!

  • రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఘటన
  • ఐదేళ్ల బాబు, మూడేళ్ల పాపను కొట్టిన చైన్‌ సింగ్
  • వీడియో తీసిన చైన్‌ సింగ్‌ సోదరుడు

రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఓ తండ్రి త‌న పిల్ల‌ల‌ను దారుణంగా కొట్టిన ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. 32 ఏళ్ల చైన్‌ సింగ్ త‌న ఐదేళ్ల బాబు, మూడేళ్ల పాపను తాడుతో కట్టేసి, సీలింగ్‌కు వేలాడదీసి చిత‌క్కొట్టాడు. 'కొట్టొద్దు నాన్న' అని ఆ ప‌సి మొగ్గ‌లు ఎంత‌గా ప్రాధేయ‌ప‌డినా విడ‌వ‌లేదు. మ‌ట్టిలో ఆడుకుంటూ బట్టలు మురికి చేసుకోవ‌డ‌మే ఆ పిల్ల‌లు చేసిన నేరం. చైన్‌ సింగ్ త‌న పిల్ల‌లను కొడుతుంటే అడ్డుకోవడం మాని అత‌డి సోదరుడు వీడియో తీశాడు.

ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఆ పిల్ల‌ల‌ను కొట్టిన తండ్రిని క‌ఠినంగా శిక్షించాల‌ని నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. చివ‌ర‌కు ఈ వీడియో పోలీసులకు చేరింది. దీంతో పోలీసులు చైన్‌ సింగ్‌తో పాటు వీడియో తీసిన‌ అతడి సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు.  

More Telugu News