South Africa: వన్డే సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు షాక్.. తొలి మూడు వన్డేల నుంచి డివిల్లియర్స్ ఔట్!

  • చేతి వేలి గాయంతో బాధపడుతున్న డివిల్లియర్స్ 
  • రెండు వారాల విశ్రాంతి అవసరమన్న బోర్డు
  • ‘పింక్’ వన్డేకు అందుబాటులో ఉంటాడన్న అధికారులు
టెస్టు సిరీస్ గెలుచుకుని జోరుమీదున్న దక్షిణాఫ్రికాకు వన్డే సిరీస్ కి ముందు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చేతి వేలి గాయంతో బాధపడుతున్న సౌతాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిల్లియర్స్ తొలి మూడు వన్డేలకు దూరమయ్యాడు. ఆరు వన్డేల సిరీస్‌లో తర్వాతి మూడు వన్డేలకు అతను అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని బోర్డు తెలిపింది. అయితే డివిల్లియర్స్ స్థానంలో తొలి మూడు వన్డేల్లో ఆడే ఆటగాడిని మాత్రం ఇంకా ప్రకటించలేదు.

జొహన్నెస్‌బర్గ్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ క్యాచ్‌ను పట్టుకునే సమయంలో డివిల్లియర్స్ చేతి వేలికి గాయమైంది. గాయం పూర్తిగా మానడానికి మరో  రెండు వారాల సమయం పట్టే అవకాశం ఉందని క్రికెట్ సౌతాఫ్రికా తెలిపింది. ఫిబ్రవరి 10న బిడ్‌వెస్ట్ వాండెరర్స్ స్టేడియంలో జరిగే ‘పింక్’ వన్డే (నాలుగో వన్డే)కు డివిల్లియర్స్ అందుబాటులో ఉంటాడని బోర్డు పేర్కొంది. అతని స్థానంలో ఆడే ఆటగాడి పేరును త్వరలోనే ప్రకటిస్తామని బోర్డు అధికారులు తెలిపారు.
South Africa
AB de Villiers
India

More Telugu News