Chandrababu: చంద్రబాబుకు కల్యాణదుర్గం ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారు: మంత్రి కాల్వ శ్రీనివాసులు

  • భైరవాని తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాల తరలింపునకు నిధులు 
  • సచివాలయంలో చంద్రబాబును కలిసిన మంత్రి హర్షం
  • ఈ ప్రాజెక్టు ద్వారా కళ్యాణదుర్గం సస్యశ్యామలమవుతుంది : కాల్వ

సీఎం చంద్రబాబునాయుడుకు కళ్యాణదుర్గం ప్రజలు తమ జీవితాంతం రుణపడి ఉంటారని
రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు
అన్నారు. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలంలోని భైరవాని తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తీసుకు వచ్చే నిమిత్తం అవసరమైన రూ.969 కోట్లు విడుదల చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడుకు తనతో పాటు కళ్యాణదుర్గం ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారని ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ సచివాలయంలోని సీఎం కార్యాలయంలో చంద్రబాబును మర్యాదపూర్వకంగా ఈరోజు ఆయన కలిశారు. అనంతరం కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ, జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను ఎత్తిపోతల ద్వారా భైరవానితిప్ప ప్రాజెక్టుకు తరలింపునకు రూ.969 కోట్లు మంజూరు చేయడం సంతోషకరమైన విషయమని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 22,323 ఎకరాలకు సాగునీటితో పాటు నియోజక వర్గ ప్రజలకు తాగునీటి సౌకర్యం కూడా కలుగుతుందని, సాగునీటితో కళ్యాణదుర్గం సస్యశ్యామలం అవుతుందని అన్నారు.

More Telugu News