rosaiah: నా వయసు పైబడింది .. ఇకపై క్రియాశీలక రాజకీయాల్లో పని చేయలేను: రోశయ్య

  • గుంటూరులో మాజీ ఎమ్మెల్యే జయరామ్ బాబు ఇంటికి రోశయ్య
  • పార్టీలకతీతంగా రోశయ్యను కలిసిన నేతలు
  • ఎక్కడికైనా వెళితే అక్కడి స్నేహితులను కలుసుకుంటానన్న మాజీ గవర్నర్
తన వయసు పైబడిందని, ఇకపై క్రియాశీలక రాజకీయాల్లో పని చేయలేనని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. గుంటూరులో మాజీ ఎమ్మెల్యే జయరామ్ బాబు ఇంటికి రోశయ్య వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీలకతీతంగా రాజకీయ నేతలు ఆయన్ని కలిశారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘నా వయసు పెరగడంతో రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించట్లేదు. ఇంకా, నేను రాజకీయాల్లో ఉత్సాహంగా తిరగగలుగుతానని అనుకోవడం ఒట్టి భ్రమ. ఎక్కడికైనా వెళితే అక్కడి స్నేహితులను కలుసుకోవడమే తప్ప..రాజకీయాల గురించిన ఆలోచన లేదు’ అని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు రాయపాటి శ్రీనివాస్, జేడీ శీలం, మాజీ మంత్రి, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తదితర నేతలు కలిశారు. 
rosaiah
Guntur District

More Telugu News