queen of bollywood: 'క్వీన్ ఆఫ్ బాలీవుడ్' దీపికా ప‌దుకునే... ఇదిగో సాక్ష్యం!

  • రూ. 100 కోట్ల క్ల‌బ్‌లో అత్య‌ధిక సినిమాలు ఈమెవే!
  • ఏడు సినిమాల‌తో దీపిక రికార్డు
  • హీరోల్లో స‌ల్మాన్ ఖాన్ టాప్‌

దీపికా ప‌దుకునే న‌టించిన 'ప‌ద్మావ‌త్' చిత్రం మొద‌టి నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్ల‌బ్‌లో చేరిన సంగ‌తి తెలిసిందే. దీంతో దీపికా పేరు మీద ఓ స‌రికొత్త రికార్డు న‌మోదైంది. క‌లెక్ష‌న్ల విష‌యంలో క్వీన్ ఆఫ్ బాలీవుడ్‌గా దీపికా ప‌దుకునే నిలిచింది. 'ప‌ద్మావ‌త్‌'తో క‌లిపి రూ. 100 కోట్ల క్ల‌బ్‌లో దీపికా ప‌దుకునే న‌టించిన ఏడు సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్‌లో మ‌రే హీరోయిన్‌కి ఈ రికార్డు లేదు.

దీపికా ప‌దుకునే న‌టించిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌', 'హ్యాపీ న్యూ ఇయ‌ర్‌', 'యే జ‌వానీ హై దివానీ', 'బాజీరావ్ మ‌స్తానీ', 'రామ్ లీలా', 'రేస్ 2' చిత్రాలు రూ. 100 కోట్ల క్ల‌బ్‌లో ఉన్నాయి. ఈ వివ‌రాల‌న్నింటినీ బాలీవుడ్ ట్రేడ్ అన‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్  ఓ ట్వీట్ ద్వారా వెల్ల‌డించారు. ఎవ‌రూ తిర‌గ‌రాయ‌లేని రికార్డు దీపికా ప‌దుకునే సృష్టించిందని ఆయ‌న కొనియాడారు.

క‌న్న‌డలో 'ఐశ్వ‌ర్య (2006)' సినిమాతో తెరంగేట్రం చేసిన దీపికా, 2007లో షారుక్ స‌ర‌స‌న 'ఓం శాంతి ఓం' సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. గతేడాది 'ట్రిపుల్ ఎక్స్' సినిమాతో దీపికా హాలీవుడ్ రంగ‌ప్ర‌వేశం కూడా చేసింది. ఇక హీరోల్లో అత్య‌ధిక వంద కోట్ల క్ల‌బ్ చిత్రాలు ఉన్న న‌టుడిగా స‌ల్మాన్ ఖాన్ నిలిచిన సంగ‌తి తెలిసిందే.

More Telugu News