honor 9: ఆన‌ర్ 9 లైట్‌ ఫ్లాష్‌సేల్‌.... 120 సెక‌న్ల‌లో ఔట్ ఆఫ్ స్టాక్‌

  • నాలుగో ఫ్లాష్ సేల్ అయిన‌ప్ప‌టికీ అద్భుత స్పంద‌న‌
  • ఫ్లిప్‌కార్ట్‌లో 12 గం.లకు ప్రారంభ‌మైన సేల్‌
  • ధ‌ర రూ. 10,999

ఆన‌ర్ 9 లైట్ స్మార్ట్‌ఫోన్‌కి వినియోగదారుల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. బడ్జెట్ ధ‌ర‌లో మంచి ఫీచ‌ర్లు ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్‌సేల్ ఇవాళ 12 గం.ల‌కు ఆన్‌లైన్ మార్కెట్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభ‌మైంది. ప్రారంభ‌మైన రెండు నిమిషాల్లోనే ఆన‌ర్ 9 లైట్ ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోయిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఫ్లాష్‌సేల్ నిర్వ‌హించ‌డం ఇది నాలుగోసారి. అయిన‌ప్ప‌టికీ ఇంత ఆద‌ర‌ణ ల‌భించడం ఆనందంగా ఉంద‌ని 'హువాయి' వినియోగ‌దారుల బిజినెస్ హెడ్ సంజీవ్ అన్నారు.

ఇప్ప‌టివ‌రకు జ‌రిగిన ఫ్లాష్‌సేల్‌ల‌లో ఇదే అత్యంత వేగంగా జరిగింద‌ని ఫ్లిప్‌కార్ట్ వెల్ల‌డించింది. మొద‌టి ఫ్లాష్‌సేల్‌ 6 నిమిషాల్లో, రెండో ఫ్లాష్‌సేల్ 3 నిమిషాల్లో పూర్తయింద‌ని తెలిపింది. 3జీబీ, 4జీబీ వేరియంట్ల‌లో ఆండ్రాయిడ్ ఓరియో ఆప‌రేటింగ్ సిస్టం, 3000 ఎంఎహెచ్ బ్యాట‌రీ సామ‌ర్థ్యం, 5.65 ఇంచుల తెర‌, హువాయి హైసిలికాన్ కిరిన్ 659 ప్రాసెస‌ర్ ఇందులో ఉన్నాయి. దీని ధ‌ర రూ. 10,999.

More Telugu News