sundeep kishan: 'మనసుకు నచ్చింది' రిలీజ్ డేట్ ఖరారు

  • సందీప్ కిషన్ హీరోగా 'మనసుకు నచ్చింది'
  • కథానాయికగా అమైరా దస్తూర్
  • వచ్చేనెల 16వ తేదీన విడుదల
మహేశ్ బాబు సోదరి మంజుల దర్శకత్వం వహించిన 'మనసుకు నచ్చింది' సినిమాను వచ్చేనెల 16వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సందీప్ కిషన్ .. అమైరా దస్తూర్ జంటగా నటించిన ఈ సినిమా, ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కింది.

ఈ సినిమా పోస్టర్స్ .. టీజర్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. అందువలన సినిమా కూడా యూత్ మనసులకు దగ్గరగా వెళుతుందని మంజుల భావిస్తున్నారు. నటిగా .. నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించుకున్న మంజుల, దర్శకురాలిగా ప్రేక్షకుల మనసులను ఏ స్థాయిలో గెలుచుకుంటుందో చూడాలి. ఇక ఇదే రోజున నాని 'అ!' సినిమా కూడా విడుదల కానుంది. ఈ రెండు సినిమాల్లో ఏది ఎక్కువ మార్కులు కొట్టేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.    
sundeep kishan
amyra

More Telugu News