zeenat aman: బాలీవుడ్ వెటరన్ నటి జీనత్ అమన్ పై లైంగిక వేధింపులు!

  • 'హరే రామ్‌ హరే కృష్ణ', 'సత్యం శివం సుందరం', 'యాదోన్‌ కి బారాత్‌' సినిమాలతో మంచి పేరుతెచ్చుకున్న జీనత్ అమన్
  • జూహూ పోలీస్ స్టేషన్ లో వ్యాపారవేత్త అమర్ ఖాన్ పై కేసు నమోదు
  • అమర్ కుటుంబంతో జీనత్ కు మంచి పరిచయం
బాలీవుడ్ వెటరన్ నటి జీనత్ అమన్ లైంగిక వేధింపులను ఎదుర్కొన్నారు. 1970 ఫెమినా మిస్‌ ఇండియా ఆసియా పసిఫిక్‌ అయిన జీనత్‌ అమన్‌ బాలీవుడ్‌ లో పలు సినిమాల్లో నటించి, బోల్డ్‌ పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచారు. 'హరే రామ్‌ హరే కృష్ణ', 'సత్యం శివం సుందరం', 'యాదోన్‌ కి బారాత్‌' వంటి సినిమాలు ఆమెకు మంచి పేరుతెచ్చాయి. 1985లో మజార్‌ ఖాన్‌ ను వివాహం చేసుకున్న జీనత్ సినిమాలకు దూరం కాగా, ఆ దంపతులకు ఇద్దరు కుమారులు.

1998లో మజార్‌ చనిపోవటంతో ఇద్దరు కుమారులతో కలసి ఆమె ముంబైలోని జూహులోనే నివసిస్తున్నారు. వారి కుటుంబానికి ముంబైకి చెందిన వ్యాపారవేత్త అమర్‌ ఖాన్‌ కుటుంబానికి మంచి స్నేహం ఉంది. గత కొంత కాలం క్రితం ఆర్థికపరమైన లావాదేవీల కారణంగా మనస్పర్థలు రావటంతో ఈ రెండు కుటుంబాల మధ్య మాటలు లేవు. అయితే కొన్ని నెలలుగా అమర్‌ సయోధ్యకు ప్రయత్నిస్తుండడంతో ఆమె కూడా సరేనన్నారు. ఈ క్రమంలో జీనత్ ను ఇంటికి ఆహ్వానించిన అమర్, ఆమె వచ్చిన తరువాత నిజస్వరూపం చూపించాడు. తన సెక్యూరిటీ గార్డు సాయంతో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె జూహు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
zeenat aman
Bollywood
actress
sexual harassment

More Telugu News