భార్య ఇంట్లో దొంగతనం చేసి అరెస్టయిన 'పంచాక్షరి' నటుడు సామ్రాట్ రెడ్డి!
- దొంగతనం కేసు పెట్టిన భార్య హర్షిత
- అరెస్ట్ చేసిన పోలీసులు
- గతంలో సామ్రాట్ పై వరకట్న వేధింపుల కేసు
తాను ఇంట్లో లేని సమయంలో వచ్చిన సామ్రాట్, తనకు చెందిన వస్తువులని చెబుతూ, పలు విలువైన వస్తువులను తీసుకెళ్లాడని ఆమె ఫిర్యాదు చేశారు. సామ్రాట్ పలు తెలుగు చిత్రాల్లో నటించాడు. కొంతకాలం క్రితం జరిగిన వీరి వివాహానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఆపై వీరి మధ్య గొడవలు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా, అనుష్క ప్రధానపాత్రలో నటించిన 'పంచాక్షరి' చిత్రంలో ఆమె భర్తగా నటించిన సామ్రాట్, మంచి పేరును తెచ్చుకున్నాడు. ఆపై తెలుగు, తమిళ సినిమాల్లో పలు క్యారెక్టర్లు చేశాడు. ఒకటి రెండు కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ నటించాడు.