Kerala: కేరళ కళారంగానికి తీరని విషాదం.. వేదికపై నృత్యం చేస్తూనే కుప్పకూలిన గీతానందన్... వీడియో!

  • 'ఒట్టాన్ థుల్లాల్'కు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన గీతానందన్
  • 30కిపైగా చిత్రాల్లో నటించిన కళాకారుడు
  • వేదికపైనే కుప్పకూలి మృతి

కేరళ శాస్త్రీయ నృత్యమైన 'ఒట్టాన్ థుల్లాల్'కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తేవడంతో పాటు సంగీత నాటక అకాడమీ అవార్డు సహా ఎన్నో అవార్డులు పొందిన కళాకారుడు, మలయాళ చిత్ర నటుడు గీతానందన్, వేదికపై నృత్యం చేస్తూ గుండెపోటుతో ప్రాణాలు వదలడంతో కేరళ కళారంగం దిగ్భ్రాంతికి గురైంది. ఇరింజలక్కుడలోని ఓ ఆలయంలో 58 ఏళ్ల గీతానందన్ ప్రదర్శన ఇస్తూ, నృత్యం చేస్తున్న వాయిద్యకారుల ముందు మోకరిల్లి, చేతులు జోడిస్తూ కుప్పకూలిపోయారు.

వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. తన చివరి క్షణం వరకూ ఒట్టాన్ థుల్లాల్ తోనే ప్రయాణిస్తానని పదే పదే చెప్పే ఆయన, చివరకు అదే నృత్యాన్ని ప్రదర్శిస్తూ కన్నుమూయడం పలువురిని కలచి వేసింది. ఆయన మలయాళంలో దాదాపు 30 కిపైగా చిత్రాల్లో నటించారు. ఆయన మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ సహా పలువు ప్రముఖులు, సినీ నటులు సంతాపం వెలిబుచ్చారు.

More Telugu News