manikyala rao: మేము కూడా మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నాం!: టీడీపీ వ్యాఖ్యలపై మంత్రి మాణిక్యాలరావు

  • మా పార్టీ నేతలను అదుపు చేస్తాం
  • టీడీపీతో విభేదాలు లేకుండా పని చేస్తాం
  • చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ పట్ల తాము కూడా మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నామని ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావు అన్నారు. బీజేపీ నేతల తీరుపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాము మిత్రధర్మాన్ని పాటిస్తున్నామని... కలసి ఉండటం బీజేపీకి ఇష్టం లేకపోతే నమస్కారం పెట్టేస్తామని ఆయన అన్నారు.

ఈ నేపథ్యంలో మంత్రి మాణిక్యాలరావు స్పందించారు. టీడీపీ నేతలను అదుపు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని, ఏమైనా విభేదాలు ఉంటే పరిష్కరించుకుందామని అన్నారని... ఈ నేపథ్యంలో, తాము కూడా తమ పార్టీ నేతలను అదుపు చేస్తామని, ఇకపై ఎలాంటి విభేదాలు లేకుండా కలసి పని చేస్తామని తెలిపారు.
manikyala rao
BJP
Telugudesam
Chandrababu
ap politics

More Telugu News