Raviteja: రవితేజ నన్ను ఎంతగానో మెచ్చుకున్నారు: రాశి ఖన్నా

  • రాశి ఖన్నా తాజా చిత్రంగా 'టచ్ చేసి చూడు'
  • రవితేజతో కలిసి కామెడీ చేశాను 
  • 'పుష్ప' అనే పాత్రలో మెప్పిస్తాను
  • డబ్బింగ్ చెప్పాలనుకున్నాను కానీ కుదరలేదు

బొద్దుగా కనిపించే రాశి ఖన్నా .. కాస్తంత స్లిమ్ గా మారిపోయి చేసిన 'జై లవకుశ' హిట్ కొట్టేసింది. రాశి ఖన్నా చాలా బాగుందంటూ పొలోమంటూ మార్కులు పడిపోయాయి. దాంతో అదే నాజూకుతనాన్ని కంటిన్యూ చేస్తూ ఆమె 'టచ్ చేసి చూడు' సినిమా చేసింది. రవితేజ జోడీగా ఆమె నటించిన ఈ సినిమా, వచ్చేనెల 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

 తాజాగా ఈ సినిమాను గురించి రాశి ఖన్నా మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నేను 'పుష్ప' అనే పాత్రలో కనిపిస్తాను" అని చెప్పింది. "సాధారణంగా కథానాయికలకు కామెడీ చేసే పాత్రలు అరుదుగా లభిస్తూ ఉంటాయి. నా అదృష్టం కొద్దీ ఈ సినిమాలో రవితేజతో కలిసి కామెడీ చేసే ఛాన్స్ దొరికింది. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పడం పూర్తి చేసిన రవితేజ, వెంటనే నాకు ఫోన్ చేసి 'చాలా బాగా చేశావ్' అంటూ అభినందించారు. ఆయనలా మెచ్చుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ సినిమాలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాలనుకున్నాను కానీ కుదరలేదు" అని చెప్పుకొచ్చింది.     

More Telugu News