anil kapoor: నా తండ్రితో కలసి న‌టించే అవ‌కాశం పదేళ్ల తర్వాత ఇప్పుడు వ‌చ్చింది: సోన‌మ్ క‌పూర్‌

  • తండ్రీకూతుళ్లుగా న‌టించ‌బోతున్న అనిల్, సోన‌మ్‌
  • సినిమా పేరు - 'ఏక్ ల‌డ్కీ కో దేఖా తో ఐసా ల‌గా'
  • అనిల్‌కి జంట‌గా జూహీ చావ్లా, సోన‌మ్‌కి జంట‌గా రాజ్ కుమార్ రావ్‌

త‌న తండ్రి అనిల్ క‌పూర్‌తో కలిసి వెండితెర మీద క‌నిపించ‌నుండ‌టం చాలా ఆనందంగా ఉందని న‌టి సోన‌మ్ క‌పూర్ చెబుతోంది. వాళ్లిద్ద‌రూ తండ్రీ కూతుళ్లుగా ఓ సినిమాలో న‌టిస్తున్నారు. ఆ సినిమా పేరు 'ఏక్ ల‌డ్కీ కో దేఖా తో ఐసా ల‌గా'. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పంజాబ్‌లో జ‌రుగుతోంది. తండ్రి అనిల్ క‌పూర్‌తో మొద‌టి షాట్ వివ‌రాల‌ను సోన‌మ్ త‌న ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. 'ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ప‌దేళ్ల త‌ర్వాత నా తండ్రితో క‌లిసి న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. థ్యాంక్యూ షెల్లీ చోప్రా' అని ఆమె పోస్ట్ చేసింది. షెల్లీ చోప్రా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

అనిల్ క‌పూర్ చిత్రం '1942 ఎ ల‌వ్ స్టోరీ' లోని ఓ పాట‌లోని మొదటి పదాలను ఈ సినిమాకు పేరుగా పెట్టారు. ఇందులో అనిల్‌కి జంట‌గా జూహీ చావ్లా న‌టిస్తుండ‌గా, సోన‌మ్‌కి జంట‌కి రాజ్‌కుమార్ రావ్ న‌టిస్తున్నారు. దాదాపు 11 ఏళ్ల త‌ర్వాత అనిల్‌, జూహీలు తెర మీద జంట‌గా క‌నిపించ‌బోతున్నారు. అక్టోబ‌ర్ 12న ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు నిర్మాత విధు వినోద్ చోప్రా స‌న్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ ఏడాది త‌న కుమారుడు హ‌ర్ష‌వ‌ర్థ‌న్ క‌పూర్‌తో క‌లిసి కూడా అనిల్ క‌పూర్ న‌టించ‌నున్నారు. ఒలింపిక్ ప‌త‌కం గెల్చుకున్న అభిన‌వ్ బింద్రా బ‌యోపిక్‌లో వారిద్ద‌రూ క‌లిసి న‌టించ‌బోతున్నారు.

More Telugu News