Mahesh Babu: క్లైమాక్స్ షూటింగులో 'భరత్ అనే నేను'

  • పోరాట సన్నివేశాల్లో మహేశ్ బాబు 
  • డిఫరెంట్ గా కంపోజ్ చేసిన రామ్ లక్ష్మణ్ 
  • ఏప్రిల్ 27న భారీ రిలీజ్    

కొరటాల శివ .. మహేశ్ బాబు కాంబినేషన్లో 'భరత్ అనే నేను' సినిమా షూటింగ్ చకచకా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. భారీ స్థాయిలో ప్లాన్ చేసిన క్లైమాక్స్ దృశ్యాలను కొరటాల తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నారు. రామ్ - లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

మహేశ్ ఈ సినిమాలో న్యూ లుక్ తో కనిపించనుండటం .. ముఖ్యమంత్రిగాను కనిపించనుండటం ఆయన అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వినోదంతో పాటు సందేశంతో కూడిన ఈ సినిమాలో కైరా అద్వాని కథానాయికగా నటిస్తోంది. మహేశ్ తో చేస్తోన్న ఈ సినిమా తన కెరియర్ కి బాగా హెల్ప్ అవుతుందని ఆమె భావిస్తోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాను, ఏప్రిల్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.    

  • Loading...

More Telugu News