alessia cara: ఆల్బ‌మ్ ఆఫ్ ది ఇయ‌ర్ - 24కే మేజిక్‌... 2018 గ్రామీ అవార్డుల జాబితా

  • ఉత్తమ న్యూ ఆర్టిస్ట్ - అలీసియా కారా
  • 'షేప్ ఆఫ్ యూ'కి ఉత్త‌మ పాప్ సోలో ప‌ర్ఫార్మెన్స్ అవార్డు
  • న్యూయార్క్‌లో జ‌రిగిన గ్రామీ వేడుక‌

హాలీవుడ్ అవార్డుల సీజ‌న్‌లో భాగంగా ఈ ఏడాది గ్రామీ అవార్డుల వేడుక అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఇంగ్లిష్ సంగీత కళాకారులకి ప‌ట్టం గ‌ట్టే గ్రామీ అవార్డుల వేడుక న్యూయార్క్‌లోని మాడిస‌న్ స్క్వేర్ గార్డెన్‌లో జ‌రిగింది. జేమ్స్ కార్డెన్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హరించిన ఈ వేడుక‌లో పాప్ సింగ‌ర్లు త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నారు. గ‌తేడాది విడుద‌లైన ఉత్త‌మ పాట‌లు, గాయ‌నీగాయ‌కులకు అవార్డులు ఇచ్చారు. ఆ అవార్డులు అందుకున్న వారి వివ‌రాలివిగో!

  • రికార్డ్ ఆఫ్ ది ఇయ‌ర్ - 24కే మేజిక్ (బ్రూనో మార్స్‌)
  • ఆల్బమ్ ఆఫ్ ది ఇయ‌ర్ - 24కే మేజిక్ (బ్రూనో మార్స్‌)
  • సాంగ్ ఆఫ్ ది ఇయ‌ర్ - ద‌ట్స్ వాట్ ఐ లైక్ (బ్రూనో మార్స్‌)
  • ఉత్త‌మ న్యూ ఆర్టిస్ట్ - అలీసియా కారా
  • ఉత్త‌మ పాప్ సోలో ప‌ర్ఫార్మెన్స్ - షేప్ ఆఫ్ యూ (ఎడ్ షీర‌న్‌)
  • ఉత్త‌మ పాప్ వోక‌ల్ ఆల్బ‌మ్ - డివైడ్ (ఎడ్ షీరన్‌)

ఇవేకాకుండా వివిధ కేట‌గిరీల‌కు సంబంధించి గ్రామీ అవార్డుల‌ను క‌ళాకారులు అందుకున్నారు. నామినేష‌న్ల‌లో ప్ర‌పంచ ప్రాచుర్యం పొందిన 'డెస్పాసిటో' పాట కూడా ఉన్న‌ప్ప‌టికీ ఒక్క అవార్డు కూడా అందుకోలేక‌పోయింది.

More Telugu News