indian army: కశ్మీర్లో ఉద్రిక్తత.. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ... ఇంటర్నెట్ సేవలు బంద్!

  • భద్రతా బలగాల వాహన శ్రేణిపై దాదాపు 250 మందికి పైగా నిరసనకారులు రాళ్ల దాడి
  • అధికారి నుంచి ఆయుధాన్ని లాక్కునేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులు
  • ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన సైన్యం, ఇద్దరు పౌరుల మృతి

కశ్మీర్ లోయలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. షోపియాన్‌ జిల్లాలోని గోవాంపురా ప్రాంతంలో భద్రతా బలగాల వాహన శ్రేణిపై దాదాపు 250 మందికి పైగా నిరసనకారులు రాళ్లు రువ్వారు. ఒక అధికారి నుంచి ఆయుధాన్ని లాక్కునేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. వారిని చెదరగొట్టేందుకు కాల్పులు జరపడంతో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

దీంతో కశ్మీర్‌ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారుల మృతికి నిరసనగా వేర్పాటు వాదులు బంద్‌ కు పిలుపునిచ్చారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. దీంతో అన్ని దుకాణాలు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. ప్రజా రవాణా స్తంభించిపోయింది.

 బారాముల్లా, బనిహాల్‌ మధ్య రైల్వే సేవలను నిలిపివేయగా, పుల్వామా, అనంత్‌ నాగ్‌, కుల్గాం, షోపియాన్‌ జిల్లాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపేశారు. కశ్మీర్‌ లోయ అంతటా ఇంటర్నెట్‌ స్పీడు తగ్గించారు. ఈ పరిస్థితులపై జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ విచారం వ్యక్తం చేశారు. మరోపక్క ఘటనపై పూర్తి నివేదిక సమర్పించమని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ సైన్యాన్ని ఆదేశించారు. 

  • Loading...

More Telugu News